- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Dhankhad: సభను అడ్డుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. ప్రతిపక్షాలపై ధన్‌ఖడ్ ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్‌లో అంతరాయం కలిగించడాన్ని ఆయుధంగా పరిగణిస్తే ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని రాజ్యసభ చైర్మన్ ధన్ ఖడ్ హెచ్చరించారు. కేంద్ర బడ్జెలో రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష ఎంపీలు బుధవారం సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా ధన్ ఖడ్ వారిపై ఫైర్ అయ్యారు. ‘బడ్జెట్‌పై చర్చ జాబితా చేయబడింది. నిబంధనలు పాటిస్తారని ఆశించి ప్రతిపక్ష నేతకు అనుమతించాను. కానీ అది ఒక వ్యూహంగా ఉపయోగిస్తుండటం నేను భావించా. అలా చేస్తే డెమోక్రసీకి ఎంతో ప్రమాదం’ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛను కాపాడటానికి పార్లమెంటును ఉపయోగించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల నాయకులు, ఈ విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే సభ ప్రతి సెషన్‌లో ఇది దినచర్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.