- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Dhalla: అక్రమ వలసదారులందరినీ వెనక్కి పంపిస్తా.. కెనడా పీఎం అభ్యర్థి రూబీ దల్లా

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా తదుపరి ప్రధానిగా రేసులో ఉన్న భారత సంతతి నేత, లిబరల్ పార్టీ నాయకురాలు రూబీ దల్లా (Ruby dhalla) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పీఎంగా ఎన్నికైతే దేశంలోకి చట్టవిరుద్ధంగా చొరబడిన వలసదారులందరినీ వెనక్కి పంపిస్తానని తెలిపారు. మానవ అక్రమ రవాణాను సైతం అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. అక్రమ వలసదారులను బహిష్కరించేందుకు తన వద్ద పక్కా ప్రణాళిక ఉందని తెలిపారు. ‘ఫేజ్ 1 ముగిసింది, మేము 2వ దశకు వెళ్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న ఉదారవాదులతో నిమగ్నమై ఉన్నాం. లిబరల్ పార్టీ అధికారికంగా అభ్యర్థిగా ఆమోదించబడినందుకు ఎంతో సంతోషంగా ఉన్నా. నా అభ్యర్థిత్వం మా పార్టీలో, కెనడియన్ రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కెనడియన్ల కోసం నిలబడటానికి, కెనడా కోసం పోరాడటానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు. కాగా, మూడు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళగా ధల్లా చరిత్ర సృష్టించారు. జనవరి 22న లిబరల్ పార్టీ నాయకుడిగా జస్టిన్ ట్రూడో స్థానంలో తన అభ్యర్థిత్వాన్ని దల్లా ప్రకటించారు.
రూబీ ధల్లా ఎవరు?
భారత్‌లోని పంజాబీ వలసదారుల కుటుంబానికి చెందిన రూబీ దల్లా కెనడాలోని మానిటోబాలోని విన్నిపెగ్‌లో 1974 ఫిబ్రవరి 18న జన్మించారు. విన్నిపెగ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మొదట మోడల్‌గా పని చేసిన ఆమె రాజకీయాల మీద ఆసక్తిలో లిబరల్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే మొదటిసారిగా 2004లో బ్రాంప్టన్-స్ప్రింగ్‌డేల్ స్థానం నుంచి హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006, 2008లో తిరిగి ఎన్నికయ్యారు. 2011లో ఓడిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా పీఎం రేసులోకి వచ్చారు. తమ పీఎం అభ్యర్థిని లిబరల్ పార్టీ మార్చి 9న అధికారికంగా ప్రకటించనుంది. దీంతో రాబోయే ఫెడరల్ ఎన్నికల్లో దల్లా పార్టీ గెలిస్తే తదుపరి ప్రధానిగా ఎన్నికవుతారు.