- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కర్ణాటక కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని వారి డిమాండ్
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం నమోదు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అసలు అగ్నిపరీక్ష మొదలైంది. ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి వీడక ముందే తమ వర్గానికి డిప్యూటీ సీఎం పదవితో పాటు హోం, రెవెన్యూ, విద్య వంటి కీలక శాఖలు కలిగిన ఐదు శాఖలకు తమ వర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను మంత్రులుగా చేయాలని వక్ఫ్ బోర్డు చీఫ్ షఫీ సాదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల బరిలో 30 సీట్లు తమ వర్గానికి కావాలని అడిగామని 15 సీట్లు మాకు లభించాయని వాటిలో 9 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారన్నారు.
దాదాపు 67- 72 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మైనారిటీ వర్గానికి చెందిన ఓటర్ల ప్రభావంతోనే గెలుపొందిందని ఒక సంఘంగా మనం కాంగ్రెస్‌కు చాలా ఇచ్చాం ఇప్పుడు మనం ప్రతిఫలంగా ఏదైనా పొందే సమయం వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాల తర్వాత అతి పెద్ద జనాభా కలిగిన మైనార్టీ వర్గాలకు రాజకీయంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నామని, తమ వల్ల లబ్ది పొందిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమకు అవకాశం కల్పించే విషయాన్ని గుర్తు చేయడానికి తాము అత్యవసరంగా సమావేశం అయ్యామన్నారు. కాగా సీఎంగా ఎవరు ఉండాలనే దానిపై ఓ వైపు డైలామా కొనసాగుతోంది.
కర్ణాటకకు కొత్త సీఎంగా సిద్దరామయ్యనా లేక డీకే శివకుమారా అనే ఉత్కంఠ కొనసాగుతుండగా వక్ఫ్ బోర్డు చీఫ్ షఫీ సాదీ తమ వర్గానికి కీలక పదవులు కావాలనే డిమాండ్ తెరపైకి తీసుకు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సాదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోవడంతో సాదీని అడ్డం పెట్టుకుని బీజేపీ బీ ప్లాన్ అమలు చేస్తోందని, కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ముఖ్యమైన పదవులు తమ వర్గానికే చెందాలనే డిమాండ్ చేయిస్తున్నారని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే.. బీజేపీని ఓడించి కాంగ్రెస్ ను గెలిపిస్తే కాంగ్రెస్ ఇప్పుడు వారి మాటలను వినాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీజేపీ మద్దతు దారులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా సాదీ డిమాండ్ పై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Read More: భజరంగ్ దళ్‌పై వ్యాఖ్యలు.. మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు షాక్!