ఢిల్లీ.. నొయిడాలలో స్వల్ప ప్రకంపనలు

by Vinod kumar |
ఢిల్లీ.. నొయిడాలలో స్వల్ప ప్రకంపనలు
X

న్యూఢిల్లీ: రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో బుధవారం నేపాల్‌లో భూకంపం సంభవించింది. దీని వల్ల ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లలో స్వల్ప ప్రకంపనలు ఏర్పడ్డాయి. ఈ భూకంపానికి నేపాల్ కేంద్రం కాగా.. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లలో భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 1.45 నిమిషాలకు రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో బజురాను భూకంపం తాకినట్టు నేపాల్‌కు చెందిన నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది.

దీని వల్ల ఢిల్లీతో పాటు ఎన్‌సిఆర్‌లలో స్వల్ప ప్రకంపనలు ఏర్పాడ్డాయి. గాయాలు కావడం లేదా ఆస్తి నష్టం కానీ జరిగినట్టు వార్తలేమీ అందలేదు. టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన కొద్ది వారాల తర్వాత భారత్‌లో ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. టర్కీ, సిరియా భూకంపం ఘటనలో 45 వేల మంది మరణించారు. మరో ముఖ్యమైన విషయమేంటంటే.. త్వరలో భారత్‌లో టర్కీ తరహా భూకంపం రాబోతోందని నిపుణులు చెప్పిన మరుసటి రోజే స్వల్ప ప్రకంపనలు రావడం గమనార్హం. భారత్‌లోని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ భూకంపం రాబోతోందని మంగళవారం నిపుణులు చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story