- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Kejriwal: బీజేపీపై ఆప్ ఆరోపణలు.. విచారణకు ఆదేశించిన ఢిల్లీ ఎల్జీ

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో రాజకీయాలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు బీజేపీపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కాషాయపార్టీ మండిపడింది. అయితే, బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’కు కుట్రలు పన్నుతోందని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్(Delhi Lt Governor) ఆదేశించారు. తమ పార్టీ అభ్యర్థులను బీజేపీ తమపైవు వైపు లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్ కాల్స్ చేసి రూ.15 కోట్లు ఇస్తామని ఆశ పెట్టినట్లు కేజ్రీవాల్, ఇతర నేతలు గురువారం చెప్పుకొచ్చారు. తమ నేతలను భయపెట్టి బీజేపీలో చేర్చుకోవడానికి తప్పుడు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కమలం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా తమ నేతలు మోసపోరని అన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ తమ నేతలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందని ఆప్ సీనియర్ నేత సంజయ్కి ఓటమి భయం పట్టుకుందని అందువల్లే తమ పార్టీ నేతలను ఆకర్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోందని సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆప్ ఆరోపణలపై బీజేపీ విమర్శలు
కాగా, ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఢిల్లీలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామనే భయంతో ఆప్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్ విరేంద్ర సచ్‌దేవా అన్నారు. బీజేపీపై ఆప్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ నేత విష్ణు మిట్టల్ ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. ఈ అసంబద్ధమైన ఆరోపణలపై ఏసీబీతో విచారణ చేయించాలని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు. దీంతో పార్టీ అధినేత కేజ్రీవాల్, సీనియర్ నేత సంజయ్‌సింగ్ సహా పలువురు నేతల నివాసాలకు ఏసీబీ అధికారులు చేరుకొన్నారు. ఇకపోతే, ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ జరిగింది. 57.70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.