- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఆర్డినెన్స్ వీగిపోవడం ఖాయం.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీప్రభుత్వ ఉద్యోగుల నియామకం, బదిలీలపై అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఫైర్ అయ్యారు. లోక్ సభలో ఆ ఆర్డినెన్స్ కు ఆమోదం లభించినా రాజ్యసభలో మాత్రం ఆమోదం లభించదని అన్నారు. రాజ్యసభలో ప్రతిపక్షాల సభ్యులు ఎక్కువ ఉన్నారని, ప్రతిపక్షాలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తే ఆ ఆర్డినెన్స్ వీగిపోవడం ఖాయమని కేజ్రీవాల్ అన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ కు ఆమోదం పలికే అవకాశం ఉందని, అయితే ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉంటే ఆ బిల్లును అడ్డుకోవచ్చని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ తమ ప్రభుత్వానికే కాదని మొత్తం ఫెడరల్ స్పూర్తికే విరుద్ధమని ఆప్ చీఫ్ తెలిపారు. ఈ ఆర్డినెన్స్ విషయంలో విపక్షాలు తమతో కలిసి రావాలని కేజ్రీవాల్ కోరారు.
Also Read..
బీజేపీ తీరుతో ప్రమాదకర స్థితిలో భారత్: కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ ఫైర్