- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Dehradun : బస్సులో బాలికపై లైంగికదాడి.. బస్టాండ్‌లోనే ముగ్గురు డ్రైవర్లు, కండక్టర్, క్యాషియర్ దురాగతం
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. ఆ రాష్ట్ర శీతాకాలం రాజధాని డెహ్రాడూన్‌లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ (ఐఎస్‌బీటీ) అడ్డాగా ప్రభుత్వ బస్సులో ఓ టీనేజీ బాలిక (17)పై ఐదుగురు కామాంధులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి తెగబడిన వారిలో ముగ్గురు డ్రైవర్లు, ఒక బస్సు కండక్టర్, ఒక క్యాషియర్ ఉండటం గమనార్హం. ఆగస్టు 13న(మంగళవారం) తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత సదరు బాలిక బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 12పైకి వెళ్లి ఒక బెంచ్‌పై కూర్చుంది. శరీరంపై గాయాలతో దారుణ స్థితిలో బస్టాండ్‌లో కూర్చున్న సదరు బాలికను చూసి స్థానిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సూపర్‌వైజర్ సరోజిని స్పందించారు. ఆమెను వెంటనే సమీపంలోని బాల్ నికేతన్‌కు తరలించారు. అనంతరం సీడబ్ల్యూసీ అందించిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఐదుగురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు.
బస్సు కండక్టర్ ట్రాప్..
వివరాల్లోకి వెళితే.. సదరు బాలి ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ వాస్తవ్యురాలు. ఆమె మానసిక స్థితి బాగా లేదు.ఆమెకు తల్లిదండ్రులు ఉన్నారు. వారికి ఉత్తరాఖండ్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందజేశారు. గతంలోనూ తమ కూతురు ఇలాగే చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని వారు పోలీసులకు తెలిపారు. ఈసారి సదరు బాలిక యూపీలోని మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీలోని కశ్మీర్ గేట్ ఏరియా వద్ద పంజాబ్‌కు వెళ్లే బస్సు కోసం సదరు బాలిక ఎదురుచూడసాగింది. ఆమెను గమనించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వ బస్సు కండక్టర్ దేవేంద్ర ఎక్కడికి వెళ్లాలని అడిగాడు. సదరు బాలిక పంజాబ్‌కు వెళ్లాలని చెప్పగా.. ఈ బస్సు ఎక్కితే డెహ్రాడూన్‌కు చేరుకొని అక్కడి నుంచి పావుంతా సాహిబ్ రూట్‌లో పంజాబ్‌కు చేరుకోవచ్చన్నాడు. అతడు మాటలు నమ్మిన సదరు బాలిక బస్సు ఎక్కింది. ఆ బస్సు డెహ్రాడూన్‌లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ (ఐఎస్‌బీటీ)కు చేరుకోగానే ప్రయాణికులంతా దిగి వెళ్లిపోయారు. అనంతరం బస్సులో బాలిక మాత్రమే మిగిలింది. దీన్ని అదునుగా తీసుకొని ముగ్గురు డ్రైవర్లు, ఒక బస్సు కండక్టర్, ఒక క్యాషియర్ లైంగిక దాడికి పాల్పడ్డారు.