Defence Budget: రక్షణ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు.. మొత్తం బడ్జెట్‌లో 8శాతం కేటాయింపు

by vinod kumar |
Defence Budget: రక్షణ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు.. మొత్తం బడ్జెట్‌లో 8శాతం కేటాయింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే 2025-26 బడ్జెట్‌లో రక్షణ రంగానికి (Defence sector) రూ.6,81,210 కోట్లు వెచ్చించింది. 2024లో రూ.6,21,540 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.59,669 కోట్లు ఎక్కువగా కేటాయించారు. ఇది గతేడాది కంటే 9.6శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 4.88 లక్షల కోట్లు కాగా మూలధన వ్యయానికి రూ. 1.92 లక్షల కోట్లు ఉన్నాయి. మొత్తం బడ్జెట్ లో రక్షణ రంగానికి 8శాతం కేటాయింపులు చేశారు. 2025-26 రక్షణ వ్యయం కోసం 2025-26లో అంచనా వేసిన జీడీపీలోలో 1.91 శాతంగా అంచనా వేశారు. కొత్త ఆయుధ వ్యవస్థలు, విమానాలు, యుద్ధనౌకల కొనుగోలు కోసం రక్షణ సేవలపై మూలధన వ్యయం కోసం రూ. 1.80 లక్షల కోట్లు, పౌర సేవల కోసం రూ. 12,387 కోట్లు కేటాయించారు. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నెట్‌వర్క్‌ రూపొందించే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌ (Boarder roads organisation) కు కూడా రూ.6,500 కోట్లు వెచ్చించారు.


Next Story

Most Viewed