బ్రేకప్ తర్వాత సూసైడ్ చేసుకుంటే.. భాగస్వామిని ఏమీ అనలేం- ముంబై కోర్టు

by Shamantha N |
బ్రేకప్ తర్వాత సూసైడ్ చేసుకుంటే.. భాగస్వామిని ఏమీ అనలేం- ముంబై కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రేకప్ తర్వాత వ్యక్తి సూసైడ్ చేసుకుంటే.. అతని లవర్ ని తప్పుపట్టలేమని తీర్పిచ్చింది ముంబై కోర్టు. మానసిక ఆవేదనతో ప్రియుడు సూసైడ్ చేసుకుంటే.. అతనిని భాగస్వామి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే నితిన్ కేనీ, మనీషా చూడాసమా ప్రేమించుకున్నారు.

కొన్నాళ్లకు నితిన్ కు మనీషాతో బ్రేకప్ జరిగింది. తర్వాత ఆమెకు రాజేశ్ పన్వర్ అనే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇది తట్టుకోలేక 2016 జనవరి 15న నితిన్ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనీషా బ్రేకప్ చెప్పడం వల్లనే.. నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కోసం న్యాయవాది వాదనలు వినిపంచారు. నితిన్ ఆత్మహత్యకు మనీషానే కారణమని కోర్టుకు తెలిపారు. కాగా.. మానసిక వేదనతో ఒక భాగస్వామి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కేసును ఐపీసీ 306 ప్రకారం సెక్షన్ 107 కింద కేసు నమోదు చేయరని కోర్టు స్పష్టం చేసింది. కాగా.. పన్వర్ తో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత కూడా నితిన్ తనను వెంబడించాడని.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.

మనీషా బ్రేకప్ చెప్పడంతో నితిన్ మానసికంగా వేదనకు గురైనట్లు కన్పిస్తుందని అదనపు సెషన్స్ జడ్జి వ్యాఖ్యానించారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నిలవాలంటే.. బాధితుడ్ని అందుకు ప్రేరేపించినట్లు లేదా సలహా ఇచ్చినట్లు స్పష్టమవ్వాలని తెలిపారు.

Advertisement

Next Story