- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కళ్లు పీకేసి.. ఎముకలు విరిచేసి

- దళిత యువతి దారుణ హత్య
- కనబడుట లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు?
- మరుసటి రోజు కాల్వ పక్కన నగ్నంగా పడి ఉన్న మృతదేహం
- భగ్గుమన్న విపక్షాలు
దిశ, నేషనల్ బ్యూరో:
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన దళిత యువతి (22) అత్యంత దారుణ స్థితిలో శవమై తేలింది. అయోధ్యకు చెందిన యువతి గురువారం ఒక మత సంబంధమైన కార్యక్రమాని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలించారు. ఆ రోజే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా యువతి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు తమ కూతురిని వెదికడానికి ఆసక్తిగా లేరని గ్రహించిన కుటుంబ సభ్యులు.. అనేక చోట్ల స్వయంగా గాలించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తమ గ్రామ సమీపంలోని కాలువ వద్ద యువతి శవం అత్యంత దారుణ స్థితిలో కనపడింది. ఆమె ముఖం, పుర్రె భాగంలో తీవ్రమైన గాయాలున్నాయి. కళ్లు పీకేసి, ఎముకలన్నీ విరిచేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరో కావాలనే దారుణంగా హింసించి చంపేశారని వారు ఆరోపిస్తున్నారు. కాగా, యువతిపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
యువతి శవం కాలువ పక్కన కనపడిందన్న సమాచారంతో అయోధ్య పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు పంపించారు. అటాప్సి రిపోర్టు వస్తే కానీ పూర్తి వివరాలు వెల్లడించలేమని అయోధ్య సర్కిల్ ఆఫీసర్ అశుతోష్ తివారీ చెపారు. కాగా, గురువారం రాత్రే తాము మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. పోలీసులు వెంటనే సెర్చ్ ఆపరేషన మొదలు పెట్టి ఉంటే తమ కూతురు దక్కేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా, దళిత యువతి హత్య విషయం తెలియగానే విపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ హాయాంలో దళితులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆరోపించాయి.