Cyclone Fengal: తమిళనాడులో ఫెయింజల్ తుఫాను బీభత్సం.. 10 మంది మృతి

by Shamantha N |   ( Updated:2024-12-03 09:16:44.0  )
Cyclone Fengal: తమిళనాడులో ఫెయింజల్ తుఫాను బీభత్సం.. 10 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు(Tamil Nadu)లో ఫెయింజల్(Cyclone Fengal) తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాల వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని 15 జిల్లాలకు వాతావరణశాఖ(IMD) ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నీలగిరి, కృష్ణగిరి, తిరుప్పూర్, ఈరోడ్, తేని, మదురై సహా పలు జిల్లాల్లో 11 సెంటీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ముంపునకు గురైన ప్రాంతంల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో(Tamil Nadu Chief Minister MK Stalin,) ఫోన్ లో మాట్లాడారు. తమిళనాడులోని వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వరద పరిస్థితిని ఎదుర్కోవటానికి, తుఫాను కారణంగా సంభవించిన విధ్వంసాన్ని ఎదుర్కోవటానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడులోని మరక్కానం సాల్ట్ బెడ్ లను బీజేపీ రాష్ట్ర చీఫ్ కె. అన్నామలై సందర్శించారు. దాదాపు 80 శాతం సాల్ట్ బెడ్ కొట్టుకుపోయిందని అన్నారు. 5 వేల మంది ఉపాధికోల్పోతున్నారని తెలిపారు.

కార్యకర్తలకు రాహుల్ సందేశం

తమిళనాడులో సహాయక చర్యల్లో సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలను రాహుల్ గాంధీ(Rahul Gandhi) కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. "తమిళనాడులో ఫెయింజల్ తుఫాను విధ్వంసం సృష్టించింది. ఈ వినాశనంలో ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ కార్యకర్తలందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు" అని రాహుల్ గాంధీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed