Cpp meeting: రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం..సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ!

by vinod kumar |
Cpp meeting: రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం..సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ!
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) సమావేశం పార్లమెంటు పెషన్ ప్రారంభానికన్నా ముందే జరగనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో సోమవారం ఉదయం ఈ భేటీ జరగనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా ఈ మీటింగ్ లో చర్చించనున్నట్టు సమాచారం. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు హాజరుకానున్నారు. మరోవైపు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీ సైతం హాజరై తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసింది.

Advertisement

Next Story