- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maharashtra: మహారాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ముంబైలోని రాజ్‌భవన్‌లో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ రాధాకృష్ణన్‌తో ప్రమాణం చేయించారు. దీంతో మహారాష్ట్రకు రాధాకృష్ణన్ 21వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండె, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌లు గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్, మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్, మాజీ సీఎం నారాయణ్ రాణె, డీజీపీ రష్మీ శుక్లా, ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహా గవర్నర్‌కి ముందు రాధాకృష్ణన్ దాదాపు ఏడాదిన్నర పాటు జార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కొంతకాలం పాటు అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 1957, మే 4న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ బిజినెస్ అడిమిస్ట్రేష్‌లో డిగ్రీ చేశారు. ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్‌గా మొదలై 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎదిగారు. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా, 1998లో కోయంబత్తూరు నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటరీ టెక్స్‌టైల్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (పీఎస్‌యూల) కోసం పార్లమెంటరీ కమిటీ, ఫైనాన్స్ కోసం కన్సల్టేటివ్ కమిటీలో కూడా సభ్యుడు ఉన్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న పార్లమెంటరీ ప్రత్యేక కమిటీలో కూడా ఉన్నారు.