ఆవులు, దూడలే ఆ సీఎం ఆస్తులు

by samatah |
ఆవులు, దూడలే ఆ సీఎం ఆస్తులు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తం రూ.1.64 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సెక్రటేరియట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో సీఎం, మంత్రుల వివరాలను పోస్ట్ చేశారు. ఈ వివరాల ప్రకారం.. ప్రస్తుతం నితీశ్ వద్ద రూ. 22,552 నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ. 49,202 ఉన్నాయి. అంతేగాక రూ.11.32 లక్షల విలువైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు, రూ. 1.28 లక్షల విలువైన రెండు గోల్డ్ రింగ్స్, ఒక వెండి ఉంగరం కలిగి ఉన్నట్టు తెలిపారు. అలాగే చరాస్తుల విషయానికొస్తే.. రూ.1.45లక్షల విలువైన 13ఆవులు, 10దూడలు, ట్రేడ్ మిల్, ఒక ఎక్సర్ సైజ్ సైకిల్ ఉన్నాయి. ఇక న్యూఢిల్లీలోని ద్వారకలో ఒక అపార్ట్ మెంట్ ఉందని.. దాని విలువ 2004లో రూ.13.78లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.1.38కోట్ల వ్యాల్యూ ఉంటుందని వెల్లడించారు. గతేడాది నితీశ్ కుమార్ ఆస్తులు రూ.రూ.75.53 లక్షలు ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక బిహార్ డిప్యూటీ తేజస్వీ యాదవ్ ఆస్తులు 2022-23కి ఆర్థిక సంవత్సరానికి గానూ..రూ.4.75లక్షలు ఉన్నాయి. రాష్ట్ర మంత్రిగా ఉన్న తేజస్వీ అన్నయ్య తేజ్ ప్రతాప్ ఆస్తుల విలువ రూ.3.58 కోట్లుగా ఉంది. కాగా, ప్రతి ఏడాది చివరి రోజున కేబినెట్ మంత్రులందరూ తమ ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించడాన్ని నితీశ్ ప్రభుత్వం తప్పని సరి చేసింది.

Advertisement

Next Story