Coromandel express accident.. అంతా 20 నిమిషాల్లోనే..

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-06 06:41:55.0  )
Coromandel express accident.. అంతా 20 నిమిషాల్లోనే..
X

దిశ, వెబ్‌డెస్క్: కోరమండల్ రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 280 మంది మృతి చెందారు. 1000 మందికి పైగా గాయాలయ్యాయి. నిమిషాల వ్యవధిలో పట్టాలపై భారీ విషాదం చోటు చేసుకుందని తెలిసింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 6.50 గంటల నుంచి 7.10 నిమిషాల మధ్యలో ఈ ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ప్రయాణీకులు నిద్రలో ఉన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్ లోని హావ్ డాకు వెళ్లున్న బెంగళూరు - హావ్ డా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా కొన్ని బోగీలు ట్రాక్ పై పడ్డాయి. అయితే ఆ బోగీలను షాలిమార్ - చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. దీంతో కోరమండల్ ఎక్స్ ప్రెస్ 15 బోగీలు బోల్తాపడాయి. బోల్తాపడ్డ బోగీలను గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది.

Also Read..

భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే

రెస్క్యూ ఆపరేషన్ పూర్తి.. పునరుద్దరణ పనులు ప్రారంభం: రైల్వే మంత్రి

Advertisement

Next Story

Most Viewed