Sambhal : ఆలయాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణం.. సంభల్‌‌లో వెలుగులోకి

by Hajipasha |
Sambhal : ఆలయాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణం.. సంభల్‌‌లో వెలుగులోకి
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని సంభల్(Sambhal) పట్టణంలో ఉన్న షాహీ జామా మసీదు గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ మసీదు ఉన్న ఏరియాలో అధికారులు, పోలీసులు ఆక్రమణల తొలగింపునకు సంయుక్త డ్రైవ్(Anti Encroachment Drive) నిర్వహించారు. ఒకచోట పురాతన ఆలయం(Temple) ఉన్న స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లను నిర్మించుకున్నట్లు ఈసందర్భంగా గుర్తించారు. అక్కడ తవ్వకాలు నిర్వహించగా.. పురాతన ఆలయానికి సంబంధించిన శివ లింగం, ఆంజనేయుడి విగ్రహం లభించాయని ఏఎస్పీ శిరీష్ చంద్ర వెల్లడించారు.

ఆ ఆలయం దాదాపు 46 ఏళ్ల కిందటిదని పలువురు స్థానికులు తెలిపారు. ఈ ఆలయం సమీపంలోనే ఒక పురాతన బావి కూడా ఉండేదన్నారు. బహుశా దానిపైనా ఇళ్లను నిర్మించుకొని ఉండొచ్చని పేర్కొన్నారు. ‘‘స్థానికంగా ఉండే హిందువులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినందు వల్లే ఈ ఆలయం పూజలకు నోచుకోలేదు. కాలక్రమంలో దీన్ని కొందరు స్థానికులు కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకున్నారు’’ అని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.



Next Story

Most Viewed