కాంగ్రెస్ అభ్యర్థుల కొత్త జాబితా విడుదల.. అమేఠీ, రాయ్‌బరేలీలపై కొనసాగుతున్న ఉత్కంఠ

by S Gopi |
కాంగ్రెస్ అభ్యర్థుల కొత్త జాబితా విడుదల.. అమేఠీ, రాయ్‌బరేలీలపై కొనసాగుతున్న ఉత్కంఠ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్స్ పార్టీ కొత్తగా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే, ఎన్నికల నామినేషన్ల దాఖలుకు మూడు రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్ కంచుకోటలు అమేఠీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం కాంగ్రెస్ విడుదల చేసిన లోక్‌సభ స్థానాల అభ్యర్థుల్లో గుర్‌గావ్ నియోజకవర్గం నుంచి రాజకీయవేత్తగా మారిన నటుడు రాజ్ బబ్బర్, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా నియోజకవర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ ఉన్నారు. అలాగే, హమీర్‌పూర్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే సత్‌పాల్ రైజాదా, ముంబై నార్త్ నుంచి భూషణ్ పాటిల్‌లను ఎంపిక చేసింది. హమీర్‌పూర్ స్థానం నుంచి బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే నాలుసార్లు గెలుపును దక్కించుకున్నారు. అంతకుముందు ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ సైతం అదే నియోజకవర్గం నుంచి పనిచేశారు.

Advertisement

Next Story