- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఇండియా’తో బీజేపీ నేతలకు నిద్రపట్టడం లేదు.. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సెటైర్లు
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చలో భాగంగా ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి బీజేపీ నాయకులకు నిద్రలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఈ రోజు పార్లమెంట్ లో కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
ఇక మణిపూర్ అంశంపై మాట్లాడకుండా ప్రధాని మోడీ ఇండియా కూటమిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ఓ చరిత్రగా మాత్రమే మిగులుతుందని ఆయన సెటైర్లు వేశారు. కాగా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చలో భాగంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.