- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wayanad : అమిత్‌షాకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ నోటీసుకు సంబంధించి శుక్రవారం రోజు ఆ పార్టీ ఎంపీ జైరాం రమేష్ రాజ్యసభలో ప్రకటన చేశారు. ‘‘వయనాడ్‌లో ప్రకృతి విపత్తు సంభవించబోతోందనే అలర్ట్‌ను వారం ముందే(జులై 23న) కేరళ ప్రభుత్వానికి అందించాం’’ అంటూ జులై 31న రాజ్యసభను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తప్పుదోవ పట్టించారని ప్రివిలేజ్ మోషన్ నోటీసులో ప్రస్తావించారు.
అమిత్‌షా చేసిన ప్రకటన తప్పుడు సమాచారంతో కూడినదని తేలిందని జైరాం రమేష్ ఆరోపించారు. తప్పుడు ప్రకటన చేయడంతో సరిపెట్టకుండా.. తాము పంపిన అలర్ట్‌కు కేరళ ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని అమిత్‌షా వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చట్టసభను తప్పుదోవ పట్టించడం అనేది సభా నియమాలను ధిక్కరించడమే అవుతుందన్నారు.