- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ కర్ణాటకను ఏటీఎంలా వాడేస్తోంది : మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఏటీఎంలా ఎడాపెడా వాడుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్‌కు ఎన్నడూ లేదని.. ప్రభుత్వ ఖజానాను దోచుకోవడం దాచుకోవడమే ఆ పార్టీ ఏకైక లక్ష్యమని ఆయన ఆరోపించారు. సోమవారం సాయంత్రం కర్ణాటకలోని షిమోగాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘‘శక్తిని నాశనం చేస్తామని ఇండియా కూటమి నాయకులు ఆదివారం రోజు ప్రతిజ్ఞ చేశారు. శక్తిపై యుద్ధం అంటే మహిళలు, భారత మాతపై యుద్ధం’’ అని ప్రధాని మోడీ కామెంట్ చేశారు. ‘‘శక్తిపై ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటే ఏం జరుగుతుందో జూన్ 4న కాంగ్రెస్ పార్టీకి తెలిసిపోతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ జూన్ 4న 400 సీట్ల లక్ష్యాన్ని ఎన్‌డీయే కూటమి సాధిస్తుంది. ఈ మహా మిషన్‌లో కర్ణాటక ఓటర్లకు పెద్ద బాధ్యత ఉంది. వికసిత్ భారత్, వికసిత్ కర్ణాటక సాధన దిశగా అడుగులు పడాలి’’ అని మోడీ తెలిపారు. కర్ణాటకలో బీజేపీకి లభిస్తున్న ప్రేమ, మద్దతును చూసి ‘ఇండియా’ కూటమి బిత్తర పోతోందన్నారు. బీజేపీ అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పెద్ద కుమారుడు బీవై రాఘవేంద్ర ఈసారి షిమోగా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ రెబల్‌గా మారిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పోటీ చేస్తున్నారు.