China: చైనా విషయంలో చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదు

by Shamantha N |
China: చైనా విషయంలో చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ నేత సామ్‌ పిట్రోడా(Sam Pitroda) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీని ఇరకాటంలో పడేశారు. కాగా.. ఈ వివాదంపై హస్తం పార్టీ వివరణ ఇచ్చింది. ‘‘చైనా విషయంలో పిట్రోడా వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదు. ఆయన మాటలు కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబించడం లేదు. విదేశాంగ విధానం, భద్రత, ఆర్థికపరంగా చైనా ఇప్పటికీ సవాలుగా ఉంది’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఇకపోతే, చైనా గురించి సామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం చైనా (China)ను శత్రువులా చూడొద్దని పిట్రోడా అన్నారు. చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించనివిధంగా ఉంటుందని పేర్కొన్నారు. మొదటినుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి వల్ల ఇరుదేశాల మధ్య శత్రుత్వం పెరిగిపోతుందని అన్నారు.

ట్రంప్ తో మోడీ భేటీ తర్వాత..

ఇకపోతే, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. భారత్- చైనా ఘర్షణల నివారణకు సాయం చేస్తానంటూ ట్రంప్‌ ఆఫర్‌ ఇచ్చారు. కాగా భారత్ ఆ ఆఫర్ ని సురక్షితంగా తిరస్కరించింది. ఇలాంటి సమయంలో సామ్ పిట్రోడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు, బీజేపీ నేతలు సామ్ పిట్రోడా వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.



Next Story

Most Viewed