Razakar: నాపై కాదు, రజాకార్ల మీద ఆగ్రహించండి

by Mahesh Kanagandla |
Razakar: నాపై కాదు, రజాకార్ల మీద ఆగ్రహించండి
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanadh) విమర్శలు కురిపించారు. ఖర్గే తనపై తరుచూ సీరియస్ అవుతున్నారని, ఆగ్రహించాల్సింది తనపై కాదని, వారి ఇల్లు, ఊరిని తగులబెట్టిన రజాకార్లపైనా అని పేర్కొన్నారు. రజాకార్లు(Razakar) చేసిన విధ్వంసాన్ని దేశం ముందు ఉంచాలని సూచించారు. మహారాష్ట్రలోని అమరావతిలో యోగి ఆదిత్యానాథ్ మాట్లాడారు. కొందరు సాధువులు కాషాయ వస్త్రాలు ధరించి రాజకీయాలు చేస్తుంటారని, కొందరైతే ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారని, అయితే, ఖద్దర్ డ్రెస్సయినా వేసుకోవాలని, లేదంటే రాజకీయాలనైనా వదిలిపెట్టాలని ఆదివారం ఖర్గే కామెంట్ చేశారు.

‘ఈ మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహిస్తున్నారు. నేను ఆయన వయసును గౌరవిస్తాను. నాపై ఆగ్రహం చూపించొద్దు. హైదరాబాద్ నిజాం మిలిటరీ విభాగం రజాకార్లను ఆగ్రహించుకోవాలని సూచించారు. ఆ రజాకార్లు మీ ఊరు, ఇల్లు వల్లకాడు చేశారు కదా. హిందువులును, మీ వరుసకయ్యే సోదరులు, సోదరీమణులను పొట్టనబెట్టుకున్నారు. కాబట్టి, విడిపోతే బలహీనులవుతారని మీ ఉదాహరణను దేశం ముందు ఉంచాలని పేర్కొన్నారు. ఖర్గేకు చెందిన నేటి బీదర్ నైజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. ఇండియన్ యూనియన్‌లో కలువకుండా ప్రజలను అణచివేసిన సైన్యం రజాకార్ సైన్యం(Nizam Militia).

Advertisement

Next Story

Most Viewed