Congress : కాంగ్రెస్ పార్టీ ‘ఎల్జీబీటీక్యూఐఏ’ విభాగం ఆవిర్భావం.. తొలి అధ్యక్షుడిగా మారియో డీ పెన్హా

by Hajipasha |
Congress : కాంగ్రెస్ పార్టీ ‘ఎల్జీబీటీక్యూఐఏ’ విభాగం ఆవిర్భావం.. తొలి అధ్యక్షుడిగా మారియో డీ పెన్హా
X

దిశ, నేషనల్ బ్యూరో : లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్ సెక్స్ వర్గాల వారి కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) విభాగం ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దీని పేరు ‘ఎల్జీబీటీక్యూఐఏ+ వర్టికల్’. దీనికి తొలి అధ్యక్షుడిగా సామాజిక కార్యకర్త, ప్రముఖ చారిత్రకవేత్త మారియో డీ పెన్హాను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఎల్జీబీటీక్యూఐఏ వర్గాల వారి వివాహాలకు చట్టబద్ధతను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఈయన కూడా ఒకరు.

మొత్తం మీద ఈ ప్రకటనలో మన దేశంలో ఎల్జీబీటీక్యూఐఏ వర్గం వారి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన తొలి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. వాస్తవానికి 2020 సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎల్జీబీటీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయితే అందులోని ఎవరినీ నియమించకపోవడంతో అది పనిచేయలేదు.

Advertisement

Next Story