- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Mallikarjun Kharge: తప్పనిసరి పరిస్థితుల్లోనే- రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం గురించి ఖర్గే వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధంఖర్(Jagdeep Dhankhar)పై తప్పని పరిస్థితుల్లో అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) అన్నారు. ఇండియా కూటమి నేతలతో కలిసి మీడియాతో ఖర్గే మాట్లాడారు. ఛైర్మన్ ప్రవర్తన దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌పై తమది "వ్యక్తిగత పోరాటం" కాదని అన్నారు. "తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చర్య తీసుకోవలసి వచ్చింది. మేం ఇప్పటికే నోటీసు ఇచ్చాము. ఈ సున్నితమైన సమస్యపై ప్రతిపక్షం ఐక్యంగా ఉంది. సభలో మాట్లాడేందుకు చైర్మన్ మాకు ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు. మూడేళ్లుగా క్లిష్టమైన సమస్యలను లేవనెత్తడానికి మాకు సమయాన్ని ఇవ్వలేదు. మేం ఛైర్మన్ నుంచి రక్షణ ఆశిస్తున్నాము.. కానీ, అతను అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మాత్రమే మాట్లాడేందుకు ఛాన్స్ ఇస్తున్నారు. ఛైర్మన్ స్వయంగా ప్రభుత్వాన్ని సమర్థిస్తుంటే ప్రతిపక్షాల మాట ఎవరు వింటారు?" అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతలకు ఉపన్యాసాలు
రాజ్యసభ ఛైర్మన్ ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిలా వ్యవహరిస్తున్నారని ఖర్గే అన్నారు. అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నేతలకు ఛైర్మన్ ఉపన్యాసాలు ఇస్తున్నారని, వారిని మాట్లాడనీయకుండా నిలువరిస్తున్నారని కాంగ్రెస్ అధినేత పేర్కొన్నారు. ఆయన ప్రభుత్వ అధికార ప్రతినిధిలా పనిచేస్తున్నారు.. రాజ్యసభకు అంతరాయం కలిగించేది చైర్మనే అని అన్నారు. ప్రతిపక్ష నేతలను ఆయన లక్ష్యంగా చేసుకుంటున్నారని, తరచూ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని ఆరోపించారు.