- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైపూర్‌లో కలకలం..పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్‌లలోని స్కూళ్లకు హెచ్చరికలు రాగా.. తాజాగా సోమవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. సుమారు నాలుగు స్కూళ్లకు ఈ మెయిల్ ద్వారా వార్నింగ్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. సెయింట్ థెరిసా స్కూల్, ఎంపీఎస్ స్కూల్, విద్యాశ్రమ్ స్కూల్, మానక్ చౌక్ పాఠశాలల్లో బాంబులు అమర్చామని ఆయా స్కూళ్ల ప్రిన్సిపాల్‌లకు ఈ మెయిల్ ద్వారా సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసు బృందం, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ముందు జాగ్రత్తగా పాఠశాలల్లోని పిల్లలను బయటకు పంపించారు. మెయిల్ పంపిన వ్యక్తి ఈ మెయిల్ ఐడీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆదివారం సాయంత్రం ఢిల్లీ నగరంలోని 20ఆస్పత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సైతం బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.