Jammu Kashmir : సాధ్యమైనంత త్వరగా కశ్మీర్ అసెంబ్లీ పోల్స్ : సీఈసీ రాజీవ్ కుమార్

by Hajipasha |
Jammu Kashmir : సాధ్యమైనంత త్వరగా కశ్మీర్ అసెంబ్లీ పోల్స్  : సీఈసీ రాజీవ్ కుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్‌లో సాధ్యమైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనే ప్రకటనకు కట్టుబడి ఉన్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు. కశ్మీర్‌‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న సంఘ విద్రోహ శక్తులకు అక్కడి ప్రజలు ఎన్నికల్లో సరైన సమాధానం చెబుతారన్నారు. శుక్రవారం జమ్మూలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్‌ లోపలి, బయటి సంఘ విద్రోహ శక్తుల నుంచి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా చూస్తాం’’ అని రాజీవ్ కుమార్ చెప్పారు.

జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు బలమైన మద్దతును ప్రకటించాయన్నారు. ‘‘మేము కశ్మీర్‌లోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలను కలిశాం. వారంతా కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించిన తీరును కొనియాడారు. అది గొప్ప విజయమని చెప్పారు’’ అని సీఈసీ వివరించారు. ‘‘రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ సరిసమానమైన భద్రత కల్పించాలనే డిమాండ్ రాజకీయ పార్టీల నేతల నుంచి వచ్చింది’’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని ఓటర్ల లిస్టులో ఎవరి పేరైనా లేకపోతే, దాన్ని జోడించి ఆగస్టు 20న మరో జాబితాను విడుదల చేస్తామన్నారు.

Advertisement

Next Story