- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Delhi Airport: ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ.25 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.25 కోట్ల విలువైన కొకైన్ లభ్యమయ్యింది. ఈ కేసులో ఇద్దరు బ్రెజిలియన్ మహిళలను అరెస్టు చేసినట్లు కస్టమ్స్ విభాగం పేర్కొంది. దక్షిణ అమెరికా నుండి యూరప్ ద్వారా భారత్ కు డ్రగ్స్ రవాణా చేసినట్లు గుర్తించారు. నిందితులు 1.72 కిలోల కొకైన్‌ను ఇంజెక్షన్ ల ద్వారా శరీరంలో దాచినట్లు పేర్కొన్నారు. జనవరి 26న సావో పాలో నుండి పారిస్ ద్వారా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన మహిళా ప్రయాణికురాలిని అరెస్టు చేశారు. ఆమె నుంచి 959 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 93 ఓవల్ ఆకారపు గుళికలను ఆమె మింగినట్లు పేర్కొన్నారు. 38 ట్యాబ్ లెట్స్ ని ఎయిర్ పోర్టులోనే స్వాధీనం చేసుకోగా.. మిగితా 55 పిల్స్ ని సఫ్దర్ జంగ్ హాస్పిటల్ లో వైద్యవిధానాల ద్వారా సేకరించారు. ఆ డ్రగ్స్ విలువ రూ.14.39 కోట్లు. మరో కేసులో సావో పాలో నుండి పారిస్ ద్వారా వస్తున్న మరో బ్రెజిలియన్ మహిళను అరెస్టు చేశారు. విచారణలో రూ.11.52 కోట్ల డ్రగ్స్ ని దాచిపెట్టినట్లు అంగీకరించింది. ఆమె నుంచి 786 గ్రాముల మొత్తం 79 ఓవల్ పిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ ఎన్డీపీఎస్ (NDPS) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. "ఈ ఆపరేషన్ వెనుక ఉన్న పెద్ద సిండికేట్‌ల కోసం అధికారులు వెతుకుతున్నారు" అని కస్టమ్స్ విభాగం సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టింది.