- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cm pinarayi vijayan: వయనాడ్ బాధితులను కేంద్రం అవమానించింది.. సీఎం పినరయి విజయన్
దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్ విషాదానికి అక్రమ మైనింగ్, అనుమతి లేని మానవ నివాసాలే కారణమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. భూపేందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. తిరువనంతపురంలో విజయన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు బాధితులను అవమానించేలా ఉన్నాయన్నారు. కేరళలోని కొండ ప్రాంతాలపై కనీస అవగాహన ఉన్న ప్రజలెవరూ అక్కడ నివసిస్తు్న్న ప్రజలను అక్రమ వలసదారులుగా పేర్కొనరని తెలిపారు.
ఇలాంటి ఆరోపణల ద్వారా విపత్తులో ప్రభావితమైన ప్రజలను అవమానిస్తున్నారన్నారు. ఈ అనధికార స్థిరనివాసులు ఎవరు? కొండచరియలు విరిగిపడి మరణించిన ఎస్టేట్ కార్మికులా? లేక తమకున్న చిన్నపాటి భూముల్లో జీవించే సామాన్యులా? అని ప్రశ్నించారు. ఆ ప్రాంతాల్లో నివసాముండే ప్రజలను అనధికార ముద్ర వేయలేవమని తెలిపారు. భారీ విషాదం నేపథ్యంలో లోతైన ఆలోచన, సమిష్టి కృషి అవసరమున్న తరుణంలో కొద్దిమంది తమ ప్రయోజనాల కోసం ఈ పరిస్థితిని ఉపయోగించుకుంటున్నారన్నారు. వాస్తవ పరిస్థితుల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని కొండ ప్రాంతాల వలసలకు శతాబ్దాల చరిత్ర ఉందని గుర్తు చేశారు. కేంద్రం ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తుందో సమాధానం చెప్పాలన్నారు.