బీజేపీ కార్యకర్త మృతికి సీఎం బాధ్యత వహించాలి.. లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్

by Javid Pasha |
బీజేపీ కార్యకర్త మృతికి సీఎం బాధ్యత వహించాలి.. లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్
X

దిశ, వెబ్ డెస్క్: లోక్ జనశక్తి చీఫ్, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ బిహార్ సీఎం నితిశ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని, పోలీసు దెబ్బలకు గాయపడి బీజేపీ కార్యకర్త విజయ్ సింగ్ చనిపోయారని అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయించిన హత్య అని ఆయన అభివర్ణించారు. విజయ్ సింగ్ మృతికి సీఎం నితీశ్ కుమార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిస్థితి లేదని, ఎవరైనా నిరసనలకు దిగితో ఇలా పోలీసులతో లాఠీ ఛార్జీ చేయిస్తున్నారని ఆరోపించారు. కాగా మృతుడు విజయ్ సింగ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన చిరాగ్.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story