- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం కేజ్రీవాల్‌ను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర ఉందని అన్నారు.. లోక్‌సభ ఎన్నికల ముందు సీఎంను అరెస్ట్ చేయడం వెనుక కారణం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌కు ప్రజల మద్దతు ఉందని, ఆప్ పార్టీని ఎవ్వరూ ఏమీ చెయలేరని రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. ‘ఆప్ ప్రభుత్వాలు కొనసాగుతున్న ఢిల్లీ, పంజాబ్ లో జరిగిన అద్భుతమైన పనుల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు. ఆయన శరీరాన్ని అరెస్ట్ చేయగలరేమో కానీ, ఆయన ఆలోచనలను, సిద్ధాంతాలను అరెస్ట్ చేయలేరు’ అంటూ రాఘవ్ చద్దా ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Next Story