ఢిల్లీ మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు

by Ajay kumar |
ఢిల్లీ మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు
X

- సీఎం రేఖా గుప్తా వద్దే ఫైనాన్స్, రెవెన్యూ

- ఆశీశ్ సూద్‌కు హోం శాఖ

- పర్వేశ్ శర్మకు పబ్లిక్ వర్క్స్, అసెంబ్లీ వ్యవహారాలు

- యమున హారతిలో పాల్గొన్న సీఎం, మంత్రులు

దిశ, నేషనల్ బ్యూరో:

ఢిల్లీ నూతన కేబినెట్ సీఎం రేఖా గుప్తా అధ్యక్షతన తొలి సారి భేటీ అయ్యింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేఖా గుప్తా రోజంతా బిజీగా గడిపారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి వర్గ సహచరులతో కలిసి వాసుదేవ్ ఘాట్ వద్ద యమున హారతిలో పాల్గొన్నారు. రేఖా గుప్తాతో పాటు మంత్రులు, పార్టీ నాయకుడు జయంత్ జే పాండా కూడా హారతి కార్యక్రమంలో ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో యమునా నది కాలుష్యం ప్రధానాంశంగా ప్రచారం జరిగింది. ఈ విషయంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. బీజేపీ పాలిత హర్యానా యమున నీటి సరఫరాను అడ్డుకోవడాని నది నీటిలో విషం కలుపుతోందని ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రివాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బీజేపీతో పాటు హర్యానా ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే యమునా నది ప్రక్షాళనకు నడుం భిగిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ప్రధాని మోడీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే యమునా నది ప్రక్షాళన విషయంలో తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలియజేయడానికే సాయంత్రం యమునా నది హారతిలో సీఎంతో పాటు మంత్రులు పాల్గొన్నారు.

కొత్త పోర్ట్‌ఫోలియోలు ఇవే..

యమునా నది హారతి అనంతరం సీఎం రేఖా గుప్తా అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రేఖా గుప్తా, సీఎం : ఫైనాన్స్, ప్లానింగ్, సాధారణ పరిపాలన, మహిళ, శిశు సంక్షేమ శాఖ, సర్వీసెస్, రెవెన్యూ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఐ అండ్ పీఆర్, ఏఆర్, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ : పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, అసెంబ్లీ వ్యవహారాలు, మంచి నీరు, సాగునీరు మరియు వరద నియంత్రణ, గురుద్వారా వ్యవహారాలు

ఆశీశ్ సూద్ : హోం శాఖ, విద్యుత్, అర్బన్ డెవలప్‌మెంట్, విద్యా శాఖ, ఉన్నత విద్య, శిక్షణ, సాంకేతిక విద్యా శాఖ

మంజిందర్ సింగ్ సిర్సా: ఫుడ్ అండ్ సప్లయిస్, అటవీ మరియు పర్యావరణం, పరిశ్రమల శాఖ

రవీందర్ సింగ్ ఇంద్రజ్ : సాంఘీక సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, సహకార శాఖ, ఎన్నికలు

కపిల్ మిశ్రా : లా అండ్ జస్టిస్, కార్మిక శాఖ, ఎంప్లాయిమెంట్ శాఖ, ఆర్ట్స్, కల్చర్, లాంగ్వేజ్ శాఖ, టూరిజం శాఖ

పంకజ్ కుమార్ : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, రవాణా, ఐటీ



Next Story