- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
CM Eknath Shinde : ‘మహా’ పోల్స్‌పై సీఎం షిండే కీలక ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబరు రెండో వారంలో జరిగే అవకాశం ఉందని సీఎం ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు విడతల్లో పోలింగ్ ప్రక్రియ జరిగే సూచనలు ఉన్నాయన్నారు. ఆదివారం ముంబైలోని సీఎం అధికారిక నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏక్‌నాథ్ షిండే ఈ వివరాలను తెలిపారు. గెలుపు అవకాశాలు, బలాబలాల ప్రాతిపదికన మహాయుతి కూటమిలోని మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతుందని ఆయన వెల్లడించారు.
8 నుంచి 10 రోజుల్లోగా బీజేపీ, ఎన్సీపీ, శివసేన (షిండే) మధ్య సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వస్తుందన్నారు. తమ ప్రభుత్వానికి యువత, మహిళల మద్దతు ఉందని షిండే చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో సమతూకంతో మహాయుతి ప్రభుత్వం పాలన అందించిందన్నారు. కాగా, ఈసారి పోల్స్‌లో మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లకుగానూ 150 నుంచి 160 సీట్లు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. మిగతా 128 నుంచి 138 సీట్లను ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన (షిండే) పార్టీలు పంచుకోవాల్సి రావచ్చని అంచనా వేస్తున్నారు.