వాస్తవాధీన రేఖను మార్చేందుకు చైనా ప్రయత్నాలు!

by Harish |
వాస్తవాధీన రేఖను మార్చేందుకు చైనా ప్రయత్నాలు!
X

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో డ్రాగన్ దేశం చర్యలపై కేంద్ర విదేశాంగ శాఖ కీలక విషయాలు వెల్లడించింది. ఈ మేరకు 2021-2022 వార్షిక నివేదికను సోమవారం విడుదల చేసింది. వాస్తవాధీన రేఖను మార్చేందుకు చైనా నిరంతర ప్రయత్నాలు ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపాయని తెలిపింది. ఏప్రిల్-మే 2020 నుండి, పశ్చిమ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంట యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి చైనా అనేక ప్రయత్నాలు చేపట్టిందని నివేదికలో పేర్కొంది. ఇది శాంతి ప్రక్రియకు ప్రశాంతతకు తీవ్రంగా భంగం కలిగించిందని వెల్లడించింది. అయితే వీటికి భారత సైన్యం ధీటుగా బదులిచ్చిందని విదేశాంగ శాఖ తెలిపింది.

చైనా భారత సంబంధాలు సంక్లిష్ట స్థితిలో ఉన్నాయని పాలసీ ప్లానింగ్ డివిజన్ మంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఇరువైపులా ఎలాంటి వివాదాలు జరగకుండా నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. సరిహద్దు ప్రాంతాలలో ప్రశాంతతను పునరుద్ధరించడానికి మిగిలిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు దౌత్య, సైనిక మార్గాల ద్వారా చైనాతో భారతదేశం సానుకూలంగానే వ్యవహరించిందని పేర్కొంది. 2020లో గల్వాన్ లోయలో సైనికుల ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.

Advertisement

Next Story

Most Viewed