- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తూర్పు చైనా సముద్రంలో చైనా, రష్యా ఆర్మీల సంయుక్త గస్తీ..
బీజింగ్: తూర్పు చైనా సముద్రంలో చైనా, రష్యా సైన్యాలు మంగళవారం సంయుక్త గస్తీ నిర్వహించాయి. ఈ సముద్రం మీదుగా కొరియా ద్వీపకల్పంలోని దక్షిణ, తూర్పు సరిహద్దులకు దగ్గరగా చెరో నాలుగు రష్యా, చైనా యుద్ధ విమానాలు వచ్చాయని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. దీంతో ఆ ప్రాంత పహారా కోసం తాము కూడా యుద్ధ విమానాలను రంగంలోకి దింపాల్సి వచ్చిందని పేర్కొంది.
ఎయిర్ డిఫెన్స్ జోన్ అంటే.. విదేశీ యుద్ధ విమానాలు ఏదైనా దేశపు బార్డర్‌కు దగ్గరగా వెళ్ళినప్పుడు, వాటి పరిధిని, హద్దులను గుర్తు చేస్తూ సైన్యం హెచ్చరిక జారీ చేసే ప్రాంతం. దీనిపై చైనా రక్షణ శాఖ స్పందిస్తూ.. "చైనా, రష్యా సైన్యాల వార్షిక సహకార ప్రణాళికలో భాగంగా ఈ గస్తీ నిర్వహించాం" అని వెల్లడించింది. 2019 నుంచి రష్యా, చైనాల ఆర్మీలు కలిసి జపాన్ సముద్రం, తూర్పు చైనా సముద్రం మీదుగా సంయుక్త గస్తీ నిర్వహించడం ఇది ఆరోసారి.