చంద్ర ప్రపంచంలో రారాజు.. జపాన్‌కు మన ఇస్రో చేసిన సాయమిదీ

by Hajipasha |
చంద్ర ప్రపంచంలో రారాజు.. జపాన్‌కు మన ఇస్రో చేసిన సాయమిదీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) గుర్తింపు విశ్వవ్యాప్తమైంది. చివరకు టెక్నాలజీ జగత్తులో రారాజుగా వెలుగొందుతున్న జపాన్ కూడా ఇస్రో సాయాన్ని తీసుకుంది. గత శనివారం తొలిసారిగా తమ ల్యాండర్‌ ‘స్లిమ్’ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్)ను జపాన్ సక్సెస్‌ఫుల్‌గా చంద్రుడిపై దింపింది. ఈ ఘన విజయం వెనుక మన ఇస్రో కూడా ఉంది. జపాన్ అంతరిక్ష నౌక ‘స్లిమ్’ కోసం చంద్రుడిపై సురక్షితమైన ల్యాండింగ్ స్థలాన్ని ఎంపిక చేసి ఇచ్చింది మన ఇస్రోనే. ఇందుకు అవసరమైన ఇమేజెస్‌‌ను మన ఇస్రో కంట్రోల్ సెంటర్ నుంచి జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (JAXA)కు పంపారు. ఆ ఇమేజెస్ మన ఇస్రోకు ఎక్కడివి అంటే.. చంద్రయాన్-2 మిషన్‌లో మన దేశం చంద్రుడిపై ల్యాండర్‌ను ల్యాండ్ చేయించడంలో ఫెయిలైంది. పొరపాటున రాళ్లురప్పలు ఉన్న ప్రదేశంలో చంద్రయాన్-2 ల్యాండర్‌ను ల్యాండ్ చేయించడంతో అది పేలిపోయింది. అయినప్పటికీ ఆనాడు ఇస్రో ప్రయోగించిన మూన్ ఆర్బిటర్ ఇంకా చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంది. ఇటీవల చంద్రయాన్-2 మూన్ ఆర్బిటర్ నుంచే చంద్రుడి ఉపరితలం ఫొటోలను సేకరించి జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఇస్రో పంపింది.

Advertisement

Next Story