కాంగ్రెస్‌కు నిజాయితీ లేదు

by John Kora |
కాంగ్రెస్‌కు నిజాయితీ లేదు
X

- ఢిల్లీ ఓటర్లు జాగ్రత్తగా ఉండాలి

- హెచ్చరించిన ఆప్

దిశ, నేషనల్ బ్యూరో:

కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేదని, అదొక మోసకారి పార్టీ అని ఆప్ మండిపడింది. చంఢీగర్ మేయర్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి హర్‌ప్రీత్ కౌర్ బాబ్లా విజయం సాధించడంతో ఆప్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ ఎన్నికతో కాంగ్రెస్, ఆప్ మధ్య గ్యాప్ మరింతగా పెరింది. ఆప్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నా.. కాంగ్రెస్ కౌన్సిలర్లు క్రాస్ ఓటింగ్ చేయడంతోనే తాము ఓడిపోయామని ఆప్ ఆరోపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లు రహస్య పొత్తు పెట్టుకున్నాయని విమర్శిస్తోంది. కాంగ్రెస్ పట్ల ఢిల్లీ ఓట్లు జాగ్రత్తగా ఉండాలని.. ఆ పార్టీకి చిత్తశుద్ది లేదని హెచ్చరిస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ విజయం సాధించడంతో సంబరాలు చేసుకుంటున్నారని ఆప్ ఆరోపించింది. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్ముకుంటే ఇలాగే మోసం చేస్తారని ఓటర్లను ఆప్ నాయకులు హెచ్చరిస్తున్నారు. కాగా, చంఢీగర్ మేయర్ ఎన్నికతో ఆప్, కాంగ్రెస్ ఒకరిపై మరొకకు మరింతగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇండియా బ్లాక్‌లో భాగస్వాములుగా ఉన్న ఈ రెండు పార్టీల మధ్య దూరం రోజు రోజుకూ పెరిగిపోతోంది.


Next Story