- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > కేంద్రం కీలక నిర్ణయం: అయోధ్య ఎయిర్ పోర్టుకు 150మంది సీఐఎస్ఎఫ్ కమాండోల కేటాయింపు
కేంద్రం కీలక నిర్ణయం: అయోధ్య ఎయిర్ పోర్టుకు 150మంది సీఐఎస్ఎఫ్ కమాండోల కేటాయింపు
X
దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 22న అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానాశ్రయానికి 150 మందికి పైగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమాండోలను మంజూరు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయోధ్య ఎయిర్ పోర్టుకు వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. దీనిని గతేడాది డిసెంబర్‌లో ప్రధాని మోడీ ప్రారంభించారు. దీనికి తాజాగా భద్రతను కేటాయించడం గమనార్హం. కొత్త ఎయిర్ పోర్టును సందర్శించే యాత్రికులు, సందర్శకులకు ఎటువంటి ముప్పు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. విమానాశ్రయం 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీనికి ప్రతి గంటకు రెండు నుండి మూడు విమానాలను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది.
Advertisement
Next Story