- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో భారతీయ విద్యార్థిపై ఉక్రెయిన్ల దాడి.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో: ఉక్రెయిన్-రష్యా యుద్ధం తారాస్థాయికి చేరింది. యుద్ధం కారణంగా వేలాది మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై మరింత పట్టుసాధించేందుకు రష్యా దళాలు ఐరోపా ఖండంలోనే అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ అయిన జాపోరిషియాపై దాడికి దిగాయి. ఈ అణు కేంద్రంలో పేలుడు సంభవిస్తే అది ఐరోపాకు ముగింపు అవుతుందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వీడియో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ముందు ముందు భారీ ప్రళయం వాటిళ్లే అవకాశం ఉన్నందున భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత వేగాన్ని పెంచింది. యుద్ధం కారణంగా విమానయానం మూసివేయడంతో ఉక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న దేశాలైన రొమేనియా, హంగేరి, పోలాండ్ ల వైపు భారతీయులంతా వెళ్లిపోవాలని సూచించగా.. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయులంతా కీవ్ నగరాన్ని వీడుతుండగా.. వారిపై కాల్పులు జరపడతో ఓ విద్యార్థికి గాయాలు అయినట్లు పౌర విమానయాన సహాయ మంత్రి వీకే సింగ్ ప్రకటించారు. గాయపడిన వ్యక్తిని తిరిగి కీవ్ నగరంలోకి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.