- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CBSE: రెండుసార్లు పది పరీక్షలు.. తొలిగా ఫిబ్రవరిలో, రెండో సారి మేలో ఎగ్జామ్స్!

దిశ, నేషనల్ బ్యూరో: పదో తరగతి(Class 10) బోర్డు పరీక్షలు యేటా రెండు సార్లు నిర్వహించాలనే ముసాయిదా నిబంధనలకు సీబీఎస్ఈ(CBSE Draft) మంగళవారం ఆమోదం తెలిపింది. తొలిగా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు, రెండో ఎడిషన్(Two Times Exam)గా మే 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించాలని ఈ ముసాయిదా పేర్కొంది. ఈ రెండు పరీక్షలు మొత్తం సిలబస్(X syllabus)పై ఉంటాయని, విద్యార్థులకు ఒకే పరీక్షా కేంద్రాన్ని(Exam Centre) కేటాయిస్తారని వివరించింది. పరీక్ష ఫీజులోనూ మార్పులుంటాయని, రెండు పరీక్షలకు ఫీజు ఒకేసారి దరఖాస్తు చేస్తుండగానే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ రెండు ఎడిషన్ల పరీక్షలే సప్లిమెంటరీ పరీక్షలుగానూ ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ మరే స్పెషల్ ఎగ్జామ్స్ నిర్వహించరాదని ఈ డ్రాఫ్ట్ నిబంధనలు వివరించాయి. ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి అమల్లోకి రానుంది. ఈ ముసాయిదాపై విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, జనరల్ పబ్లిక్ నుంచి కూడా అభిప్రాయాలను సీబీఎస్ఈ సేకరణకు సిద్ధమైంది. సీబీఎస్ఈ వెబ్‌సైట్‌లో మార్చి 9లోపు తమ అభిప్రాయాలు సమర్పించవచ్చు. మన తెలంగాణలో ఎప్పటి నుంచో పదో తరగతి విద్యార్థులు బోర్డు(బీఎస్ఈ) పరీక్షలతోపాటు ఆ తర్వాత మార్కులు పెంచుకోవడానికి(ఇంప్రూవ్‌మెంట్) లేదా.. ఉత్తీర్ణత సాధించడానికి(సప్లిమెంటరీ) ఫీజు కట్టి పరీక్షలు రాసే అవకాశముంది.