CAPF: పారామిలటరీ బలగాల్లోకి భారీగా మహిళలు.. 2025లో నియమించనున్న కేంద్రం !

by vinod kumar |
CAPF: పారామిలటరీ బలగాల్లోకి భారీగా మహిళలు.. 2025లో నియమించనున్న కేంద్రం !
X

దిశ, నేషనల్ బ్యూరో: పారామిలటరీలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో 2025లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్‌లో 4,138 మంది మహిళా సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(BSF)లో 2, 419, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (CISF)లో 818, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ పోస్ట్ (ITBP)లో 456, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 242, సహస్త్ర సీమబల్ (SSB)లో 103 మంది మహిళా సిబ్బందిని నియమించనున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సీఏపీఎఫ్‌లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. కేంద్ర సాయుధ బలగాల్లో 2014లో 15,499 మంది మహిళా సభ్యులుండగా 2024 నాటికి 42,190 మంది మహిళలు ఉన్నట్టు వెల్లడించింది. అత్యధికంగా సీఐఎస్‌ఎఫ్‌లో 7 శాతం మహిళలు ఉండగా, అతి తక్కువగా సీఆర్‌పీఎఫ్‌లో 3.38 శాతం మంది మహిళలు ఉన్నట్టు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed