- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2000 వేల నోట్లు రద్దు.. RBI నిబంధనలు ఇవే
దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ రిజర్వు బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజు (మే 19) నుంచి రూ.2 వేల నోటు జారి నిలిపివేస్టున్నట్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఈ నోట్లను సర్క్యులేషన్ లో ఉంచొద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది.
1. 2016 నవంబర్‌లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు అయిన తర్వాత రూ.2వేల నోట్లను తీసుకొచ్చినట్లు తెలిపింది. 2018-19లోనే ఈ నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసింది.
2. 2017 మార్చి నాటికి చలామణీలో ఉన్న నగదు రూ.2వేల నోట్ల వాటా 89 శాతంగా ఉంది. 2018 మార్చి 31 నాటికి రూ.6.72 లక్షల కోట్లు. 2023 మార్చి నాటికి రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. చలామణీలో ఉన్న మొత్తం నగదులో 10.8 శాతానికి తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది.
3. ‘క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2వేల నోట్లను చలామణీని వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది.
4. రూ.2వేలు నోటు అనేది ప్రస్తుతం లావాదేవీలకు వినియోగించుకోవచ్చని తెలిపింది.
5. 2013-14లోనూ ఇలీగే సర్క్యులేషన్‌లో ఉన్న నోట్లను వెనక్కి తీసుకుంది.
6. ప్రజలు రూ.2000 నోట్లను ఎంత మొత్తంలో అయినా బ్యాంకుల్లోని తమ అకౌంట్లలో డిపాజిట్ చేయవచ్చు. ఇందుకు మామూలు బ్యాంకు నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.
7. ఏదైనా బ్యాంక్ శాఖ నుంచి ఈ నెల 23 నుంచి రూ.2వేల నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. ఒకసారి గరిష్ఠంగా రూ.20వేల విలువైన నోట్లను మార్పు చేసుకోవచ్చు. సెప్టెంబరు 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, నగదును మార్చుకోవాలని ప్రజలకు సూచించింది.
8. అన్ని బ్యాంకులు రూ.2వేల నోటును జారీ నిలిపివేయాలని ఆర్‌బీఐ సూచించింది. 19 రీజినల్ ఆర్బీఐ కార్యాలయాల్లో నోట్లు మార్చుకోవచ్చని తెలిపింది.
9. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది.
10. మరిన్ని వివరాలు ఆర్బీఐ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపింది.