మోడీని ‘28పైసా పీఎం’ అని పిలవండి: డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు

by samatah |
మోడీని ‘28పైసా పీఎం’ అని పిలవండి: డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు మంత్రి, డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి నిధులు కేటాయించడంతో మోడీ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రామనాథ్ పురం, తేనీలో జరిగిన వేర్వేరు సభల్లో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి ఒక రూపాయి పన్నుగా చెల్లిస్తే.. మోడీ తిరిగి కేవలం 28పైసలు మాత్రమే తిరిగి ఇస్తున్నారని తెలిపారు. కాబట్టి ప్రధాని మోడీని ఇప్పటి‌నుంచి 28పైసల పీఎం అని పిలవాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తుందని ఆరోపించారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేసేందుకే కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) తీసుకొచ్చిందని ఆరోపించారు. తమిళనాడుకు తగిన విధంగా నిధులు కేటాయించకుండా, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయకుండా పక్షపాతం చూపుతోందని విమర్శించారు. రాష్ట్రాల్లో మోడీ పర్యటనలు కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే ఉంటాయని వ్యాఖ్యానించారు. కాగా, గతంలోనూ కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed