ISRO: శ్రీహరికోటలో మూడో లాంఛ్ ప్యాడ్

by John Kora |   ( Updated:2025-01-16 12:17:59.0  )
ISRO: శ్రీహరికోటలో మూడో లాంఛ్ ప్యాడ్
X

- ఆమోదించిన కేంద్ర కేబినెట్

దిశ, నేషనల్ బ్యూరో:

ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో మూడో లాంఛ్ ప్యాడ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇస్రో చేపట్టనున్న భవిష్యత్ ప్రయోగాలకు అత్యంత భారీ రాకెట్లను ప్రయోగించాల్సిన అవసరం ఉంది. అయితే అలాంటి భారీ రాకెట్లను పంపడానికి శ్రీహరికోటలో ప్రస్తుతం ఉన్న రెండు లాంఛ్ ప్యాడ్లు ఉపయోగపడవు. అందుకే ఈ కొత్త లాంఛ్ ప్యాడ్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఈ కొత్త లాంఛ్ ప్యాడ్ నుంచి న్యూ జనరేషన్ లాంఛ్ వెహికిల్స్ (ఎన్‌జీఎల్వీ)తో పాటు ఎల్ఎంవీ3 రాకెట్లను కూడా ప్రయోగించే వీలుంటుంది. ఈ కొత్త లాంఛ్ ప్యాడ్ నిర్మాణానికి రూ.3,984.86 కోట్ల వ్యయం కానుండగా, 48 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తారని ఇస్రో తెలిపింది. భారత్ అంతరిక్ష్ స్టేషన్ నిర్మాణంతో పాటు 2040లో చంద్రునిపైకి మనుషులను పంపే ప్రయోగాల కోసం ఈ లాంఛ్ ప్యాడ్ ఉపయోగపడనుంది. రాబోయే 20 నుంచి 30 సంవత్సరాల పాటు ఈ లాంఛ్ పాడ్ ఇస్రోకు సేవలు అందించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Next Story