- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మేనల్లుడికి బిగ్ షాక్ ఇచ్చిన మామావతి.. అన్ని పదవులు తొలగింపు

దిశ, వెబ్ డెస్క్: బీఎస్పీ(BSP)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అధినేత్రి మాయావతి(Mayawati) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్(Akash Anand)ను బీఎస్పీలోని అన్ని పదవుల నుంచి తొలగించారు. అంతేకాదు సోదరుడు ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. BSP జాతీయ కోఆర్డినేటర్‌గా ఆనంద్ నియమిస్తూ మాయావతి ప్రకటించారు. ఆకాష్ తండ్రినే ఆనంద్. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఆనంద్‌తోపాటు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ రామ్‌జీ గౌతమ్‌ను కొత్త జాతీయ స్థాయి సమన్వయకర్తలుగా నియమించారు.
ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో మాయవతి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విధానాలకు హాని కలిగించినట్లు తేలడంతో ఆకాష్‌ను పార్టీ నుంచి తొలగించినట్లు మాయావతి తెలిపారు. గతంలో ఆకాశ్ మామ అశోక్ సిద్ధార్థ్‌ను పార్టీ నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ఆకాశ్ తన రాజకీయ వారసుడని గతంలో ప్రకటించినప్పటికి.. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని ఉపసంహకరించుకుంటున్నట్లు మాయావతి స్పష్టం చేశారు.