Gautam Adani: గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు

by Rani Yarlagadda |   ( Updated:2024-11-21 03:18:50.0  )
Gautam Adani: గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ సంపన్నుల జాబితాలో 18వ సంపన్నుడు, అదానీ గ్రూప్ (Adani Group) ఆఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)కి బిగ్ షాక్ తగిలింది. అమెరికాలో అతనిపై కేసు నమోదైంది. ఇండియాలో పోర్టులు, విమానాశ్రయాలు, ఇంధన రంగాల్లో అగ్రగామి పారిశ్రామిక వేత్తగా ఉన్న ఆయనపై.. నిధుల సేకరణ కోసం లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని న్యూయార్క్ (New York)లో నేరారోపణలు వచ్చాయి. లంచం, మోసం కేసులో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీపై కేసు నమోదైంది. వీరిద్దరిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. అమెరికాలో నిధుల సేకరణ కోసం 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చేందుకు ప్లాన్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం వారిద్దరూ లంచం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు అధికారులు గుర్తించారు. వీరిద్దరితో పాటు ఏడుగురు నిందితులు ఉన్నట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. రాబోయే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టుతో 2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించే.. కాంట్రాక్టు విషయంలో అవకతవకలు జరిగినట్లు వార్తలొచ్చాయి. యూఎస్ లంచం నిరోధక చట్టం ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను వీరిద్దరూ ఉల్లంఘించడంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంపై అదానీ గ్రూప్ ఇంకా స్పందించలేదు. దీనిపై వాషింగ్టన్ లో ఉన్న ఇండియా ఎంబసీ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed