- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: భారత్ ప్రపంచ యోగా గురువుగా ఉద్భవించింది: ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ యోగా గురువుగా భారత్ ఉద్భవించిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని డాల్ సరస్సు ఒడ్డున నిర్వహించిన యోగా దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. అనంతరం షేర్-ఏ-కాశ్మీర్ సమావేశం కేంద్రం వద్ద ప్రధాని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. 2015లో తొలిసారగా యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని అన్నారు.
విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని పేర్కొన్నారు. యోగాను నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని తెలిపారు. యోగాతో శారీరకంగా, మానసికంగా మనుషుల్లో మార్పులు వస్తాయని అన్నారు. జర్మనీ దేశంలో నేటికి కొటిన్నర మంది నిత్యం యోగా చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశంలో యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందని గుర్తు చేశారు. అనేక యూనివర్సిటీల్లో యోగా కోర్సులు కూడా వచ్చాయని అన్నారు. మొత్తానికి యోగా గురువుగా భారత్ అవిర్భవించడం సంతోషదాయకమని ప్రధాని మోడీ అన్నారు.