BREAKING: ఆరో విడత ఎన్నికల్లో మరో సంచలనం.. ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్

by Shiva |   ( Updated:2024-05-27 11:38:42.0  )
BREAKING: ఆరో విడత ఎన్నికల్లో మరో సంచలనం.. ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలోని ఖుర్దా జిల్లాలో చిలికా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ జగ్‌దేశ్ ఈసారి ఖుర్దా అసెంబ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, ఆయనకు బెగునియా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కౌన్రిపట్నలో ఆయన ఓటు హక్కు ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఓటు హక్కును వినియోగించుకునేందుకు శనివారం ఆరో దశ పోలింగ్‌ సందర్భంగా భార్యతో కలిసి పోలింగ్‌ బూత్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఈవీఎం మోరాయించడంతో ఓటు వేసేందుకు కాసేపు అక్కడే నిలబడ్డాడు. ఈ పరిణామం ప్రశాంత్‌కు కోపం తెప్పించడంతో ప్రిసైడింగ్ అధికారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం కోపంలో ప్రశాంత్‌ జగ్‌దేశ్ టేబుల్‌పై ఉన్న ఈవీఎంను లాగడంతో అది కిందపడి ధ్వంసమైంది. దీంతో పోలింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై ప్రిసైడింగ్ అధికారి పోలీలసులు ఫిర్యాదు చేయగా.. పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయనను ఖుర్దా జైలుకు ఆయనను తరలించారు.

Advertisement

Next Story