- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
BREAKING: ఏఐసీసీ మరో కీలక నిర్ణయం.. లోక్‌సభ ఉప నాయకుడిగా గౌరవ్ గొగొయ్
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేందుకు సీట్లను సాధించలేకపోయినా కాంగ్రెస్ అద్భుత ఫలితాలను రాబట్టింది. దేశ వ్యాప్తంగా యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్ర ప్రజలను ఆలోచింపజేసేలా చేసింది. వెరసి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. అనంతరం ఇటీవల దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ 10 స్థానాలను కైవసం చేసుకోగా బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. రోజురోజుకు పార్టీ బలపడుతున్న వేళ ఏఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోక్‌సభ ఉప నాయకుడిగా గౌరవ్ గొగొయ్‌ను నియమించింది. అదేవిధంగా చీఫ్ విప్‌గా కె.సురేష్, విప్‌లుగా మాణిక్యం ఠాగూర్, ఎండీ జావైద్‌లను ఎంపిక చేసింది.
Next Story