BREAKING: తీహార్ జైలు నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విడుదల.. నెట్టింట వీడియో వైరల్

by Shiva |   ( Updated:2024-04-03 16:10:37.0  )
BREAKING: తీహార్ జైలు నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విడుదల.. నెట్టింట వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఇవాళ ఆయన కాసేపటి క్రితం తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సంజయ్ సింగ్ ప్రచారంలోనూ పాల్గొనవచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, సంజయ్ సింగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అత్యంత కీలకంగా వ్యవహరించారని ఈడీ ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించి అధారాలతో సహా ఈడీ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులోనూ తమ వాదనలు వినిపించారు. లిక్కర్ స్కామ్ రూపకల్పన, అమలులో ఆయనది ప్రధాన పాత్ర వహించారంటూ ఈడీ అధికారుల కోర్టుకు విన్నవించారు. కాగా, గతేడాది అక్టోబర్ 4న ఆయనను అరెస్ట్ చేసింది. తాజాగా సుప్రీం కోర్టులో ఆయనకు షరతులతో బెయిల్ లభించడంతో దాదాపు ఆరు నెలల తరువాత తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed