- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'ట్రైబల్ అఫైర్స్ శాఖకు మంత్రిగా అగ్రకులస్థులు ఉండాలి'

- బీజేపీ మంత్రి సురేశ్ గోపి సంచలన వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో:
ఆదివాసీ వ్యవహారాల శాఖను అగ్రకులస్థులకు అప్పగిస్తే మరింత మంచిగా పని చేస్తారు. ఒక్కసారి ఓ బ్రాహ్మణుడికో లేదంటే ఓ నాయుడికో అప్పగించి చూడండి. తప్పకుండా గొప్ప మార్పును చూస్తారంటూ కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపి వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సురేశ్ గోపి మాట్లాడుతూ.. మన దేశంలో ట్రైబల్ అఫైర్స్ శాఖకు కేవలం ఆదివాసీలే మంత్రులుగా ఉండాలనేది పెద్ద శాపంగా పరిణమించిందని చెప్పారు. ఆదివాసీయేతరులు ఆ శాఖను నిర్వహిస్తే చూడాలనేది నా కల. ఆదివాసీల సంక్షేమం కోసం ఇలాంటి నిర్ణయం తప్పకుండా తీసుకోవాలని సురేశ్ గోపి అన్నారు. బ్రాణ్మణ్ లేదా నాయుడు ఈ పదవిని తీసుకుంటే గొప్ప మార్పు వస్తుందని పేర్కొన్నారు. అగ్రకులాల వారికి ఆ మంత్రిత్వ శాఖను ఇస్తేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. అలాగే ఫార్వర్డ్ కమ్యూనిటీల శాఖలను ఆదివాసీలకు అప్పించించాలని కోరారు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖను తనకు కేటాయించమని ప్రధాని మోడీని కోరాను, అయితే మంత్రిత్వ శాఖలను కేటాయించేటప్పుడు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. అందుకే నాకు ఆ శాఖ రాలేదని సురేశ్ గోపి వెల్లడించారు.
సురేశ్ గోపి వ్యాఖ్యలను పలు రాజకీయ పార్టీలతో పాటు ఆదివాసీ, మైనార్టీ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. సురేశ్ గోపి వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం, అతడిని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి బినయ్ విశ్వమ్ డిమాండ్ చేశారు. అయితే నలువైపుల నుంచి సురేశ్ గోపి వ్యాఖ్యలపై వ్యతిరేకత రావడంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. తాను ఎవరినో నొప్పించడానికి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యల వెనుక సదుద్దేశమే ఉందని పేర్కొన్నారు.